Monday, June 13, 2011

అంతా నాదేననుకొంటే
లేదే చింత
అంతా నాకే అనుకొంటేనే
చిక్కంతా

ప్రేమించు
ఫరవాలేదు
అందరిపట్ల చూపించగలిగితే
ఏ ఢోకాలేదు

పార్టీకో పేపరు
సపోర్ట్ గా ఛానలు
ఏం కూసినా
ఆత్మస్తుతి-పరనింద!!

జనం పిచ్చోళ్ళే
తాన అంటే తందాన అంటారు
బుర్రలేకుండా
తందామంటారు!!

ఎదురీదే వాడి
కెన్ని దెబ్బలు!
సంస్కరిద్దామన్నప్పుడల్లా
పెడబొబ్బలు!!

మనమెలాగూ
ఎదిరించలేం!
ముందడుగేసినవారినీ
అభినందించలేం!!

వ్యక్తికాదు ముఖ్యం
వ్యవస్థ!
అన్నాహజారే , రాందేవులకూ
తప్పలేదవస్థ!!


విషయమొదిలి
అరుస్తారేల?
గుమ్మడి దొంగలయ్యీ
జబ్బ చరుస్తారేల??

1 comment:

veera murthy (satya) said...

చాలా బాగా చెప్పారు ప్రతీ పదం అక్షరసత్యమే!

పార్టీకో పేపరు
సపోర్ట్ గా ఛానలు
ఏం కూసినా
ఆత్మస్తుతి-పరనింద!... ఇది సూపర్

పైగా నల్లదనం ఎక్కువగా ఉన్నది ద్ద్ మీడియా చానల్లలోనే ...

ఎదురీదే వాడి
కెన్ని దెబ్బలు!
సంస్కరిద్దామన్నప్పుడల్లా
పెడబొబ్బలు!!

మనమెలాగూ
ఎదిరించలేం!
ముందడుగేసినవారినీ
అభినందించలేం!!

ముక్కు సూటిగా ఎంతో బాగా చెప్పారు...

మీకు నా హృదయపూర్వక అభినందనలు...
ధన్యవాదాలు

--satya