Sunday, August 9, 2009

నానీల వరదలకు
ఆనకట్ట!
యూనిక్ కవుల
చిట్టా!!(109)

కలవో
నిజముగ కలవో
తీరదు అనుమానం
ఐనా కొలుచుట మానం!!(110)

ఫ్రీగా వస్తే
దేనికైనా ఎగబడతాం
పుస్తకాలైతే
మూలనబెడతాం!!(111)

వనితా లతలకు
వచ్చింది సాధికారత!
కవితకే కావాలి
చేయూత?!(112)

అంతా నీవిచ్చిందేగా
ప్రభూ!
ఇవ్వడమంటే
నాకెందుకంత బాధ!!(113)

అంతా గీతే!
చిత్రం గీసినా
కవిత్వం రాసినా
తత్వం పలికినా!!(114)

సంగీతం
జీవితానికి కొత్తేంకాదు
చావైనా,వివాహమైనా
మేళ తాళాలే!!(115)

శిశువులు పశువులకేనా
సంగీతం!
కురియదా మేఘం
వెలుగుదా దీపం!!(116)

సంగీతానికే
జీవితానికీ
ఎంత సాపత్యం
ఎగుడు దిగుడులే నిత్యం!(117)

వాద్యాల మద్య
శృతి తప్పింది
ఆఫీసంత
రభసే, రసాబాసే!(118)

అందానికి
మేకప్ టచప్ లు
సంగీతానికి
సంగతులు గమకాలు!(119)


స్వరాలు ఏడైతేనే
అన్ని రాగాలే!
వర్ణాలు యాభయ్యారు
నానీల నెన్నరూ?!(120)

పాడే పదము
రాసే పదము
కొలిచే పదము
చేర్చును పరమ పదము!(121)

నొక్కేవాడికీ
చిక్కే వాడికీ
ప్రభూ!ఎంత బాగా
లెక్కలు సరి చేస్తావ్!!(122)

గొంతులో మాధుర్యం
గుండెలో ఔదార్యం
మనిషి కవే
నిజమైన సౌందర్యం!(123)
నిర్వచించ లేనిదీ
వర్ణన సరి పోనిదీ
అనుభూతికె తోచేదీ
అమ్మే!(124)

మకుటమంతా
పసిడిదైనా
జిగేల్మను మణులే!
పఠేల్మను నానీలే!!(125)

నా నీ లేని అవని
ఆనందగని!
నానీకవిని అవని
ఆ చందం గని!!(126)

కమల హాసమే నటనం
ఇలయ రాజసం
సంగీతం!
గీతంఏసుదాసోహం!!(127)

నానీ
అభినవ కుంభ కర్ణుడి గురక
సత్వరమే
వదిలించే చురక!(128)

నానీ
కవితకు కొత్త బాణీ
కరిగే మెత్తని
కమ్మని పేణీ(129)

స్త్రీ
షట్కర్మ యుక్తా
సహ ధర్మపత్నీ!
నవభారత నిర్మాణపు మేస్త్రీ!!(130)

నన్నేమన్నా మానె
అందరి నోటా నానే
నానీల కానె నానే
డా.గోపి ఆనె!(131)

బధిరునికి పాటెలా?
అంధునికి రంగెలా?
అంగడెన్నున్నా
అభిరుచెలా?(132)

అందంగా లేకపొవడం
కాదు శాపం
అందంగా ఉంటే పాపం?!
ఆసిడ్ ప్రతాపం!!!???(133)

ప్రేమించామని
గొంతులు కోస్తారు
కామాంధులు
కాదంటే ఆసిడ్ పోస్తారు!(134)

ఈరాఖీ చందం
ధర్మరక్షాబంధం
సాహితీ మిత్ర సుగంధం
సచ్చిదానందం!! (135)

No comments: