Tuesday, June 30, 2009

ఏ కళకైనా
పరమావధి
పులకరించాలి
ప్రతి హృది! (16)


పాడుట నా వంతు
మరి శ్రోతలను
కాపాడుట
ఎవరి వంతు?(17)

కళలు టైం వేస్టు?!
పిచ్చోడా!
యంత్రానికైనా కావాలిగా
ఓరాయ్లింగూ రెస్టూ!!(18)

కేటాయించిన
శ్వాసల కోటా
ఎప్పుడైపోతే
అప్పుడే టాటా(19)

అల్లోపతి
హోమియోపతి
అన్నీ అయిపోయాయి
ఇక యోగాయే గతి!(20)

Monday, June 29, 2009

తలపు మొలిస్తే
పాటే
తన్మయ మెస్తే
ఇక ఆటే!(11)

వేయించుకో
ఒంటిపై ‘టట్టూ’
దాపరికమే
లేదనేటట్టూ!(12)

ఓటర్లు
జూదర్లు
తాయిలాలు తాయిలాలే
పంచే డబ్బూ సారా పప్పుబెల్లలే!(13)

మావా అంటే
ఎక్కడైనా అనుకో
నాకు
వంగతోట ఉంటే కదా?!(14)

జీవకారుణ్యమా!
నీవెక్కడ?
టైర్ల క్రింద నలిగి
కుక్కలుగా పిల్లులుగా!!(15)

Sunday, June 28, 2009

విత్తు చిన్నదే
ఉనికిని కాపాడితే
అదే
వృక్షమై అవతరిస్తుంది!(6)

జీవితం
తీరని దాహము
తీర్చు‘నది’ఒకటె
అది స్నేహము(7)

కరెంటు పోయిందా
ఎంత భాగ్యం!
ఇక ఖరీదు లేని
క్యాండిల్ లైట్ డిన్నరే!!(8)

కలం
విదిల్చితే కురుక్షేత్రం
గళం విప్పితే
గంగావతరణమే!(9)

పద్యం
హృద్యమే
నానీ దోసిటి నైవెద్యమే
అనుభవైక వేద్యమే(10)

Monday, June 22, 2009

అదోవింత కాదు
ఆడదే!
తల తిప్పకు
మెడ పడుతుంది!!(1)

తెలుగోళ్ళు
ఉర్దులో మాట్లాడారా
తథ్యంగా
అది తెలంగాణే!(2)

తిండి ఇద్దరికీ
సమస్యే
ఒకడికి దొరక్క?
మరొకడికి అరక్క!(3)


రోజూ విప్పలేని
పజిలే !
మా ఆవిడ అర్థం కాని
గజలే!!(4)

క్రీగంటి కాటుకా!
దేవదాసు లెందరిని
మాడ్చి మాడ్చి
మసి చేసిందో!!(5)

Saturday, June 20, 2009

స్త్రీకెంత లౌక్యం
మొదట మొగుడే లక్ష్యం
ఎదిగిన తక్షణం
సంతాన పక్షం!