Monday, March 15, 2010

షడ్రుచుల ఉగాది-కో-యిల గానాల వినోది

బ్లాగ్వీక్షకులకు అభిమానులకు మిత్రులకు నా వి ”కృతి” సహిత ఉగాది శుభాకాంక్షలు!!

షడ్రుచుల ఉగాది-కో-యిల గానాల వినోది

కోయిలా కూయవేల?

రాయిలా మౌనమేల?

ఉగాది రాలేదనా? రాదేలనా!

మామిడమ్మ చివురేయలేదనా, మల్లి చెల్లి పూయలేదనా

చింత కాయకుంటే ఎందుకంత చింత?

మన్మధుడు చెఱకును విల్లుకై ఎత్తుకెళ్లాడనా !

మమకారాలు కరువయ్యాయనా!

నీ పాట జనం మరి’చేద’య్యిందనా!

పర్యావరణముప్పు వల్ల కన్నీటి ఉప్పూ కరువయ్యిందనా!!

ఎందుకు నేస్తం?ఈ బేలతనం

నేనున్నాను నీకోసం

నా షడ్రుచుల జీవితమూ ఉంది



తలపు(/తలుపు) “తీయని” మనసుంది

కాసింత మా’నవత’పై మమ’కార’ముంది

నచ్చక చిటపట లాడినా తప్పని సరియగు స్నేహిత(౦)ము(ఉ)ప్పుంది

కారణమేదైనా గాని మెచ్చేనేస్తాలను మరి”చేదు”౦ది

నొప్పించినా స’వరించి’ ఉల్లాస తీరాలకు పరుగులు తీసి(తీయించి) వగర్చేదుంది(వగరు+చేదు)

జీవిత మలుపు మలుపులో గెలిపించే వేలు’పులు పు’ష్కలంగా అందించే దీవెన ఉంది.

పాడవే కోయిలా..

పాడుకో యిలా....

ప్రకృతికే నేస్తంలా..పాటే సమస్తంలా...

7 comments:

Chandamama said...

మీకు, మీ కుటుంబానికి ఉగాది శుభాకాంక్షలు!

మీ కవిత బాగుంది!

మధురవాణి said...

మీకూ, మీ కుటుంబ సభ్యులకూ 'వికృత' నామ సంవత్సర శుభాకాంక్షలు.

పరిమళం said...

మీకు, మీ కుటుంబానికి వికృతి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!

మాలా కుమార్ said...

మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు .

pranu said...

చక్కని కవిత!!

pranu said...

చక్కని కవిత!!

pranu said...

చక్కని కవిత!!