రాఖీ గారు ! మీలో భావుకత ఉంది. ప్రాసలు కూడ బాగా వేస్తున్నారు. అయితే, అక్కడక్కడ అభివ్యక్తిలో ఔచిత్య భంగమవుతున్నది. గ్రాంథికం, వ్యావహారికం కలగలిపి వ్రాస్తున్నారు. కొన్ని చోట్ల మిశ్రమ సమాసాలు చేస్తున్నారు. ఈ లోపాలను సరిదిద్దుకొంటే, మీరు మంచి కవిగా రాణిస్తారు. మినీ కవితలతోబాటు, ఆధునిక సామాజిక రుగ్మతలపై ఒక పేజీ, లేక ఒకటిన్నర పేజీ కవితలు చిక్కగా వ్రాయగలిగితే మీ శక్తిని మీరు బేరీజు వేసుకోగలుగుతారు. అన్నట్టు, మీరు ధర్మపురి వాస్తవ్యులని తెలిసి చాలా సంతోషించాను. ధర్మపురి నరసింహస్వామి మా ఇంటి ఇలవేల్పు. ఆ గుడిలో అర్చకునిగా పని చేసిన కీ.శే. నంబి రంగయ్య గారు మా మేనత్త భర్త. ఆ లక్ష్మీ నరసింహుని దీవెనలు, శేషప్ప కవి ఆశీస్సులు మీకు పుష్కలంగా లభించు గాక !
4 comments:
http://ganga-cheppaveprema.blogspot.com/
దయచేసి ఈ బ్లాగును కూడా ప్రోత్సహించండి
http://ganga-cheppaveprema.blogspot.com/
:):)
రాఖీ గారు !
మీలో భావుకత ఉంది. ప్రాసలు కూడ బాగా వేస్తున్నారు.
అయితే, అక్కడక్కడ అభివ్యక్తిలో ఔచిత్య భంగమవుతున్నది. గ్రాంథికం, వ్యావహారికం కలగలిపి వ్రాస్తున్నారు. కొన్ని చోట్ల మిశ్రమ సమాసాలు చేస్తున్నారు. ఈ లోపాలను సరిదిద్దుకొంటే, మీరు మంచి కవిగా రాణిస్తారు.
మినీ కవితలతోబాటు, ఆధునిక సామాజిక రుగ్మతలపై ఒక పేజీ, లేక ఒకటిన్నర పేజీ కవితలు చిక్కగా వ్రాయగలిగితే మీ శక్తిని మీరు బేరీజు వేసుకోగలుగుతారు.
అన్నట్టు, మీరు ధర్మపురి వాస్తవ్యులని తెలిసి చాలా సంతోషించాను. ధర్మపురి నరసింహస్వామి మా ఇంటి ఇలవేల్పు.
ఆ గుడిలో అర్చకునిగా పని చేసిన కీ.శే. నంబి రంగయ్య గారు మా మేనత్త భర్త.
ఆ లక్ష్మీ నరసింహుని దీవెనలు, శేషప్ప కవి ఆశీస్సులు మీకు పుష్కలంగా లభించు గాక !
Post a Comment