Friday, September 4, 2009

నివాళి-ఈ కవితా కేళి

ఈ ప్రహేళిక – బహు తేలిక

1. దొడ్డు బియ్యం తిన్నోడు
దొడ్డ మనసు రేడు
నడ్డి వంచి
ఒడ్డు చేర్చునెవడు?
2. తెల్గు పంచె కట్టు
మీసం మెలిపెట్టు
చిర్నవ్వు కనికట్టు
గుట్టు కనిపెట్టు?
3. రైతెద చప్పుడు
ఫ్రీ విద్యుత్తెప్పుడు
మాట తప్పడు
మడమ తిప్పందెవ్వడు?
4. సదా నీటి వేటనో
భగీరథ బాటనో
మరో కాటనో
ఉండేదే చోటనో?
5. వ్యవ ’సాయం’
ఇంకి పోని తోయం
రైతు శ్రేయం
ఎవరి ధ్యేయం?
6. రెండు రూకల బియ్యం
పేదలతో నెయ్యం
అందరికారోగ్యం
ఎవరికి సాధ్యం?
7. తా డాక్టరు
సిన్మా యాక్టరు(?)
విశిష్ట క్యారెక్టరు
ఎవరా చీఫ్ మినిష్టరు?
8. ఇందిరా భక్తుడు
రాజీవ మిత్రుడు
సోనియా విధేయుడు
ఏ కాంగ్రేసీయుడు?
9. జనం గుండెలో చిరంజీవి
వరాల బావి
అస్తమించని రవి
ఎవరది?
10. నెలంతా నవ్వే
చంద్ర బాబు
రాజులకే నవాబు
ఎవరో చెప్పు జవాబు?
11. పాద యాత్రలు
క్రొత్త ఒరవడి సూత్రులు
కారు మానవ మాత్రులు
ఎవరు?
12. ఆడపడచు కన్నైనా
అంధుల కన్నైనా
రైతువెన్నుదన్నైనా
ఎవరానే?
13. సంక్షేమ పథకాలు
తీర్చు సంక్షోభాలు
జన జాతకాలు
మార్చే సంతకాలు?
14. ఇందిరా గృహాలు
రాజీవారోగ్యశ్రీలు
పావలావడ్డీలు
ఎవరి వరాలు?
15. వృద్ధులకు సాయం
యువకులకు భత్యం
మహిళాభ్యుదయం
ఎవరి ధ్యేయం?
16. “జన ప్రియ నేతా
అందుకో చేజోత”
ప్రభావిత మీ కవిత
ఎవరి చేత?

3 comments:

A Rama Krishna Rao said...

manam oka maha maneeshini kolpoyam.
atani bhavalanu acharinchi
atani manassuku shanti chekuruddam

సుభద్ర said...

chaalaa baagaa raasaaru.

DR.GOLLAPELLI RAMKISHAN RAKI DHARMAPURI said...

mee prathi spandanaku naa namovaakamulu ellappudoo ilaage nannu vennu tattutoo untaarani aashistoo
sadaa
mee snEhaabilaashi
raakhee