శివుడు ఢమరుకం
మురళి కృష్ణుడు
వీణాపాణి వాణి
సంగీత ప్రియులే!(81)
అనగనగ రాగం
వృద్దియగు
అందుబాటుతో
అనురాగం?!(82)
బీటలువారినా తూట్లు పడినా
గుండె
బీటు తప్పదుగా!
పాట ఆపదుగా!! (83)
గీతాసారం
జీవన వేదం
సంగీతం
బ్రతుకు నాదం(84)
రాధ ఎందుకంత
ఎడిక్ట్?
మురళీ రవానికా!
కృష్ణుడి గారవానికా!!(85)
త్యాగయ్య శ్యామయ్య
అన్నమయ్య
అందరూ సంగీత స్రష్టలే!
లబ్దప్రతిష్టులే!!(86)
బాల మురళి ఏసుదాసు
సుబ్బలక్ష్మీ
ఎంతమందని స్మరిద్దాం!
ఎవరిని విస్మరిద్దాం!!(87)
గీత సంగీతాలను
పలికాడు కృష్ణుడు
అందుకే ఆయన
దేవుడు!(88)
గీత మేధను
సవరిస్తుంది
సంగీతం
మనసునలరిస్తుంది!(89)
జేసుదాసు గొంతులో
ఎంత మాధుర్యం!
తేనేల వానల్లో
శివుడు మానవుడు?!(90)
నా కవితా గంధం
ధర్మపురితో
జన్మబంధం
అమ్మా నాన్నల ఆశీస్సులందాం!(91)
మోక్షమిస్తా నన్నా సరే
మళ్ళీమళ్ళీ పుడతా
పాట కోసం
పాడడం కోసం!(92)
హరికథలూ బుర్రకథలూ
పురాణాలు నాటకాలు
వాటి చలవే
కదిలె కలమే!(93)
రాఖీ కానుక
మీకీ
నానీల బోయీలు
పాటల పల్లకి!(94)
సహవాస దోషం
అవతలి పార్శ్వం
నా గీతాలు
సంగీతాలు(95)
వీడుకోలు
అంపకాలు
వ్యధాభరితాలు
శివరంజని తోడి రాగాలు!(96)
భాష
బహు కురచ
భావమంతా
వెళ్ళగ్రక్కలేమని మరిచా!(97)
ఆనందపు
బాష్పీభవన
స్థానం దుఃఖమే!
అందుకే ఆనంద భాష్పాలు!!(98)
నవరసాలకూ
ఒకటే గొంతు
మరి కోటి భావాలనెలా
పలికింతు?(99)
సాహిత్యం సంగీతం
ఎక్కడైనా లెక్కలే
ఛందో బంధాలు
శృతి లయ చందాలు!!(100)
అరెరే! వాద్యాలన్నీ
మటుమాయం?
కీబోర్డు రాకాసి
మ్రింగేసింది!!(101)
సంగీతం
నేడెంత సౌకర్యం!
బిట్లుబిట్లుగా
కంప్యూటర్ డిజిట్లుగా!!(102)
పూలు
ప్లాస్టిక్కా?
డోంట్ వర్రీ-బీ హ్యప్పీ!
ఫారిన్ సెంటు స్ప్రే నొక్కా!!(103)
పల్లె పదాలు
పలికె పెదాలు
బాల్యం జ్ఞాపకాల్లో !
మైమరచిన క్షణాల్లో!!(104)
రైతు యాతమేస్తే
గాన తరంగం!
జాలరి వలవేస్తే
జలతరంగం!!(105)
కుక్కుటం
భూపాలం నేస్తాలు!
ఇద్దరూ మబ్బున్నే లేస్తారు
మన నిద్ర దోస్తారు?!(106)
గ్రామఫోన్లు పాత
క్యాసెట్లు ముగిసిన కథ
సీడీల వేడి
ఐపాడ్ దాడి!!(107)
త్రివిక్రముడూ
వామనుడౌతాడా?
రేడియో మారిందిగా
బుల్లి ఎఫ్ఫెమ్ గా!!(108)
Sunday, August 9, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment