Sunday, August 9, 2009

అమ్మపాల కమ్మదనం
లాలిపాట తీయదనం
ఎరుగదీ తరం
వివరం!(71)

అలెగ్జాండర్!
ఆగిపోయినావా
కొనసాగుతోందింకా
నానీల జైత్రయాత్ర!(72)

సంకర భాషలు
వంకర భాష్యాలు
అంతా ఎస్సెమ్మెస్ ల
ప్రభావాలు!(73)

గుండెకెన్ని
చిల్లులు పడితేనేం!
గానం మానుతుందా
వేణువు!!(74)

బీడీ
కల్చర్(?)నేర్చుకుంది
సిగరెట్టయి
ఫోజులే కొట్టింది!(75)

కథలకు
కష్టకాలమొచ్చింది
ఆదుకునే
అమ్మమ్మలే లేరు మరి!(76)

నోరు తియ్యబడింది!
చెప్పడం మరిచా
నేస్తాన్ని
విజయం వరించింది!!(77)

మీకు బొత్తిగా
లౌక్యం లేదండి!
అందుకే కదా
నిన్ను కట్టుకుంది!!(78)

సరిగమలంటే
కావు అక్షరాలు
గళ నరాలు మీటితే
మ్రోగే స్వరాలు!(79)

గొర్లకాపరికెలా
తెలుసు
మురళి సంగతులు?
స్వరం దేవుడి వరం!(80)

No comments: