చెలియలి కట్టుందని
సంబరపడకు
సునామి వస్తే
కడలి కడకు ?!
ముగ్గురి సీటు నల్గురిదైంది
స్నేహం పంచితే!
ఇద్దరికిరుకే
విస్మరిస్తే !!
కూడు గుడ్డా
నువ్వేసే భిక్షే కదా!
ఈ బతుకు
ఓ రైతు బిడ్డా!!
విత్తులెరువులెండ్రిన్లు
మద్దతు ధరలు
నిత్యం రణాలే!
చావుక్కారణాలే!!
థింక్ పాజిటివ్
రాజుగారి పెద్ద భార్య
పతివ్రత
మరి చిన్న భార్య
మహా పతివ్రత!!
గ్లాసులో సగం
నీళ్లు లేవనుకొంటే నిరాశ
సగమున్నాయనుకొంటే
ఆశ!!
Monday, June 13, 2011
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
మంచి మాటల్తో , మంచి చెమక్కుతో ..... చాలా బాగాచెప్పారు రాఖీ గారు.....
tnx satya
Post a Comment