Tuesday, July 21, 2009

టెక్నాలజీ
ఆహ్వానించ దగ్గదే!
కాని సంగీతం కూడ
సాఫ్ట్ వేరై పోయిందే?!(46)

సంగీతం
మధురమే
తాదాత్మ్య్పపు
మకరందం చిలికితే!(47)

టీవీలు సినిమాలు
చూస్తే పని పాడే!
బెటర్ ఐపాడే
దానికదే పాడే!!(48)

చిన్ని గుండె లో
ఎన్ని భావాలో
బుల్లి సెల్లు లో
ఎన్నెన్ని భాగ్యాలో(49)

ఏం పనీ పాటా లేదా?
బ్రతుకే పనైంది
పాటనే
కరువైంది!(50)

2 comments:

yuktha said...

namaste raki gaaru
kavita kosame puttinatlu mee kavitaa jari
saralamyna pada sampada mee sontam
endamaavulanu cheripi vennela nilipi gunde vaakili talupu tattaaru
aapyayatato kudukunnaa mee shyli
ajnaanam lo unna manavulaku vestundi churaka
madyataragati batukula saradaalu
mandahaasalu saradaa churakalu
wow raki gaaru anipinchelaa unnaai

DR.GOLLAPELLI RAMKISHAN RAKI DHARMAPURI said...

చిగురాకు నేను
చిరుగాలికే మైమరచేను
ఏకాకి నేను
చిరు స్పర్శకే పులకరించేను
అనాధను నేను
చిరునవ్వుకే పరవశమౌతాను
బీడు భూమి నేను
చిట్టి చినుకుకే అనందం తట్టుకోలేను
ఎండిన మోడు నేను
ఆమని కై అర్రులు చాస్తాను
ఎడారి దారి నేను
ఒయాసిసుకై పరితపించి పోతాను
పసి వాణ్ణి నేను
దగ్గర తీస్తే ఆశగా చేతులు సాచేను
చకోరి నేను జాబిలికై జాలిగ చూస్తాను
కవిని నేను
కాసింత ప్రశంస కే బానిసనౌతాను
ఏమిచ్చుకోను అభిమానులందరికీ
శిరసు వంచి నేను అభివందన మంటాను