Saturday, January 31, 2009

అంతా ఘనులే

***********************




అంతా ఘనులే
త్యాగ ధనులే
కుదబెడ్తె చంద్రన్న
తెగనమ్మే రాజన్న

సుధకై మధిస్తే
హలాహలం
వెబ్ వలపన్నామా
వైరస్ మాయా జాలం

నిన్న అమెరికా
కలల కలబోత
నేడు ఆమెరిక
కలతల లత

వలసల అమెరికా
నిన్నటి గాథ
వెతల అమెరికా
నేటి కథ

సాఫ్ట్ వేరంటే
నిన్న వంగి వంగి సలాం
"సాఫ్ట్" వేరై నేడు
అతలాకుతలం

ఆడితే ఆటేదైనా
ఆరోగ్యమే
క్రికెట్ చూస్తే ఏముంది
రోజంతా వ్యర్థమే

కరెంటుకోతలు
పంట కోతలు
నేతల కోతలు
రైతన్న గుండె కోతలు

దిగుబడి-పెట్టుబడి
రాబడి
బై దళారి దోపిడి
రైతు కంటతడి

No comments: