Thursday, August 27, 2020

"లబ్ డబ్" కొత్త లఘురూప కవితా ప్రక్రియ-రూప కర్త-డా.రాఖీ

కవిత్వం
సీతాకోకచిలుక

అంతర్జాలం
ఇంద్రజాలం

ప్రణయం
అ(న)భయం

రక్తదాహం
ఉగ్రవాదం

హోళీ
వర్ణసంఘ(గ)మం

పదోపరీక్ష
పరుగుపందెం

పాట
బ్రతుకుబాట

ఇల్లాలు
అర్ధాంగి

కలం
కదనకుతూహలం

నరకం
బ్రతికుండగానే...

ప్రయత్నం
ఓటమినోడిస్తూ ...!

'అర్థమైతే'
పరమానందం..!

జీవితం
సార్థకమైనప్పుడే...!

నిన్న
నిండుబావి

రేపు
ఎండమావి

నేడు
కుండ ఖాళీ

ఆనందం
దైవం


విగ్రహం
ప్రతిబింబం

మీడియా
సంచలనం

వార్త
ఆవిష్కరణ

చట్టం
శాసనం

ప్రాధమ్యం
వికాసం

గతం
మతిలో

భవిష్యత్తు
చేరని తీరం

వర్తమానం
క్షణికం

భయం
చావు

వేదన
బహిష్కరణ

ఈక్షణం
జీవనం

సమయం
కరువు

శుభోదయం
స్నేహహస్తం

ప్రేయసి
తలపుల్లో

ఆశ్చర్యం
తెలియనిదంతా...!!

సాధ్యం
సాధనతో

నాలుక
ఉభయవైరి


కవి
చిరంజీవి !

మెదడుపొరల్లో
జ్ఞాప'కాల'దొంతర

వీక్షణ
భావయానకం...!!

అంతరార్థం
బ్రహ్మపదార్థం

తలలు బోడి
తలపుల పూబోడి

పరదా
'చాటువు'

చూపు
కనికట్టు

"మన"అనురాగం
ప్రయో'జన యోగం

ప్రవాహమోహం
కడలి దాహం

వాగ్బాణం
మౌనసంయ'మనం

మౌనo
సమాధానమే

వలస
బ్రతుకుతెరువు

ముత్యాలనగలు
నగవులు...!

సాహసం
మడమ తిప్పదు

సింగారం
బంగారంభద్రం

ధైర్యం
వెన్నుచూపదు

సమయోచితం
సమరం చేయదు


ఊళ్ళో కరువు
కంట్లో నీళ్ళు

అలక
ప్రేమసూచిక

పుస్తకాలపురుగు
ప్రతి'పేజి'తిరుగు

మగనిఅలక
మంచానికెరుక

చెలిఅలక
మౌనమే మెలిక

తడి
తలగడ

సంతృప్తి
జీవనదీప్తి

శుభరాత్రి
కలలమైత్రి

నమస్కారం
సంస్కారం

శుభోదయం
శుభాకాంక్ష

చదువు..
కొంటేనే..!

ప్రచారం
పోకడ(FASHION)

నవ్వు'నది
వర'ద'లా

జ్యోతిష్యం
సంసిధ్ధత

గారడీ
దొంగబాబా

వివాహం
జీవితఖైదు

ఇల్లాలు
జైలరు


చంకనపాప
మగ(ధీరు)డు

గొడుగు
నాన్నలా...!

మకరందం
పూలచెలిమె

దర్పణం
సమీక్ష

క్షణం
పురిట్లో మరణం

నటనల జీవనం
జీవితమే నాటకం..!!

శుభోదయం
పునరుజ్జీవనం

తప్పు
గుండెపుండు

ప్రార్థన
జనహితం

స్వార్థం
నావిశ్వం

ఓటమి
గుణపాఠం

అనుభవాలు
షడ్రుచులు

అవినీతి
మానవ'త్వం

తూర్పు
కాంతితోరణం!

ప్రేమ
గొంతుకో'తా'డు??!!

కేంద్ర యునివర్సిటీ
రాజకీయ కేంద్రం

వినయం
విజయం


ప్రక్షాళన
వ్యవస్థ

పోలీస్ విఫలవ్యవస్థ..!
అదుపుచేసినా...!?

అందరికీ కళ
అందమైన కల

వేరుకుంపటి
అధిపత్యదాహం

సంఘటితం
విజయపథం

గుండెపోటు
"ఉన్నోళ్ళకే"..!

మౌనకుటుంబం
తలమునకల బ్రౌసింగ్..!!

ఊపిరి
ఊరికోసం

సమ్మె
గర్భస్రావం?!

యాజమాన్యం
మాయావ్యూహం!

విఛ్ఛిన్నం
కుటిలపర్వం

సత్తా
సాధ్యం

నెరవేరు
విరాట్ తీరు

జట్టుకృషి
గెలుపు వెరసి

ఉగ్రవాదం
నరమేధం

నీటికరువు
గుండె చెరువు

జోహారు
ఊహలకు..!


కలవరమేల
కల వరమగులే!!

ప్రణయజ్వాల
అధరనవనీతం

సేవలదండు
నూటపన్నెండు

బడి
రాబడి

వైద్యం
చోద్యం

జీతాలపెంపు
పన్నుల కుమ్మరింపు

ప్రతిభాపద్మాలు
సేవాఫలితాలు

వాడని కుసుమం
వ్యా'కుల'త్వం

అరచేతి పాచి'క
అభి'మతాల సూచిక

ఇసుక తిన్నెలు
మేడలవన్నెలు

పీకేదే
ఆదాయప్పన్ను...!

ఉద్యోగపర్వం
ఉపాధ్యాయ వరం

కార్పొ'రేట్లు'
వైద్యానికి తూట్లు

కోర్టు
జీవితపార్టు

"ఈనాడు"
ఏనాడూ..!!

తెలంగాణా'దేశం'
గాజుకన్ను

సీటుబెల్టు షి'కారు
ఉండదింక బేజారు


చెరువులు
కల్పతరువులు

ఓటమి
ఓ గురువు

ఊపిరి
ఉన్నంతవరకే

ఊపిరి
నేస్తం

మానవీయం
దయనీయం

చినుకు చినుకు
కడలి కడకు

జలగీతం
ప్రజల గీతం

ఉగాది పచ్చడే
రు'చేదై'తేనేం..!!

ఉగాది' కైతే'
పాట పాతే..!!
అమ్మ భిక్ష
అక్షరం

హాస విలాసం
నయనమూ!!

మనసు దుబాసి
నేత్రం!

నీచూపు
నీ లోపలివైపు!

మైత్రి
ఛత్రి!

కవిత్వం
మేలుకొలుపు

జీవితం
నిత్య నూతనం

విజన్ విధ్వంసం
ఉగ్రవాద నినాదం

ప్రాణం విలువే,
మనకు మాత్రమేనా!!

ప్రతి తరుణం
పర్యావరణం

తొలకరి
రైతు సిరి

మత్తు మత్తులో
చిత్ర విపత్తు

రాదారి గోదారి
నగరాలు నగుబాటు

కల్తీ రక్తం
వైద్యం చోద్యం

చట్టం న్యాయం
పౌరుల ప్రాప్తం

దేశం మనదే
దేశం మాదిగా?!

ఆర్భాటం ..!
మధ్యతరగతి..!!


హృదయ ప్రకంపం..!
రెప్పల్లో ఉప్పెన!!

పందెం..!
స్పూర్తి..!!

వృక్ష సంరక్షణ..!
e-వినియోగం..!!

అరచేతివిశ్వం..!
స్మార్ట్ ఫోన్..!!

కవిత్వం..!
లబ్ డబ్..!!

క్షంతవ్యం..!
ఉభయకుశలం..!!

పశ్చాత్తాపం..!
పునర్నిర్మాణం..!!

రేపు..!
చేరలేని దూరం..!


కలతేల?
'కల' తేల!!

ఓటరు డేటా..!
కటకట(లా?).,అకటా..!!

జలతారుపరదా..!
సూక్తిముక్తావళి..!!

పాతివ్రత్యం..!
మనదిమాత్రమే..!!

రాజకీయపార్టీలు..!
నేతల చలివేంద్రాలు..!!

గెలుపే ముఖ్యం..!
ఎంతకైనా దిగజారితేం..?!

ముఠాలు..!
ఫేస్ బుక్ కవుల్లో..!!

ప్రతీతి రీతి..!
పరస్పరంగోక్కోడం..!!

ఓటు..!
ఐదేళ్ళ జాతకం..!!

సిబిఐ దర్యాప్తు..!
రాష్ట్రాలఛాయిస్..!!

శకునిపాచిక..!
పేరుగుర్తుల తికమక..!!

'డీ'..!
పా'గా'రెడీ'..!!

ఐ.సి.యు..!
రంగరంగడిరంగస్థలం..?!

ఎన్నికలు..!
ఓటరే అప్రమేయుడు..!!

ఓటు..!
వాడి'తే.,బ్రహ్మాస్త్రం..!!

ఠీవీనై..!
చర్చలసొల్లు..!!

కేంద్రం..!
సమాఖ్యలక్ష్యంగా..!!

అందరూ కృష్ణులే..!
న్యాయం దృష్టిలో..!!

అన్నీ ఉన్నయ్..!
అసంతృప్తితో సహా..!!

పబ్జీ..
పరలోక సాధనం..!

పరీక్ష
బ్రతుక్కూ..!























Wednesday, February 20, 2019

బి.నర్సయ్య_ పెద్దపల్లి
9491041835 06-07-2009.
ప్రియమైన రాఖీ గారూ.....!

ధర్మపురి నరహరి శతకం -REVIEW


మీ ధర్మపురి నరహరి శతకం సాంతం చదివాను.మరొక్కసారి ధర్మపురి వీథుల్లో ,గోదావరి తీరాన విహరించిన అనుభూతి_’సిరివెన్నెల ’లో – ఈ గాలీ ఈ నేలా - పాటలా.
భక్తిరసానికి ఆధునికతను జోడించి తేలికైన పదాలతో మీ భావాల్ని, అనుభూతుల్ని సూటిగా ఆవిష్కరించారు.
పదప్రయోగంలో మీ విలక్షణత అనితర సాధ్యం, ఈ కావ్యానికి ప్రత్యేక ఆకర్షణ అదే! ఆభరణాల్లో కంసాలి రాళ్ళను పొదిగినట్లు పదాలను కూర్చి పద్యాలను మెరిపించే నైపుణ్యత మీలో ఉంది.
నాకు తోచిన రీతిలో _ఈ సంపుటిలో రెండు విభిన్న వస్తువు(content)లతో కూడిన పద్యాలున్నాయి.ఒకటి –ధర్మపురి నరహరిని స్తుతిస్తూ ,అనుగ్రహాన్ని ఆశిస్తూ ,ధర్మపురి క్షేత్ర ప్రత్యేకతల్ని వర్ణిస్తూ ఉన్న పద్యాలు , ఇవి భక్తిరస ప్రధానమైనవి ,వీటన్నింటికీ ’ధర్మపురి నరహరి ’ అన్న చివరి పాదం ,వాటిని సంపూర్ణం చేస్తుంది.
ఉదా|| 1 నుండి 40 దాకా పద్యాలు.
రెండో రకం- సమాజాన్ని సరిదిద్దాలనే ఆకాంక్షతో దానిపై సంధించిన బాణాలు – మానవతా వాదానికి ప్రతీకలు, ఉదా|| 49 నుంచి దాదాపు మిగతావన్నీ.వీటికి ’దర్మపురి నరహరి ’ అన్నది అదనపు పంక్తియే.మొదటి మూడు పాదాలతో ఇవి నిక్కచ్చిగా నానీలే.మిగితావి ’నా’ ,’నీ’ లు కావచ్చు.
ఈ కాలం కవులు తమ సంపుటాలను ముఖచిత్రాల విషయంలో ,ముద్రణ విషయంలో Novelty కోరుకుంటున్నారు.దాని వల్ల Readers & Saleability పెరుగుతుంది.
నిరంతర పఠనం ద్వారా కవి మరింత ఉత్తమ కవిత్వాన్ని అందించగలడని ఓ పీఠిక లోఉంది. పేజీ 11 చివరి పంక్తి- నేటి కవులకు నాటి కవుల పఠనం అని ఉండాలేమో ....
భావ స్పష్టతతో పాటు భావ గర్భితం కవనాన్ని రసమయం చేస్తోంది. భావగర్భిత కావ్య సృష్టి అశేష ,విశేష కృషి దీక్షలతోనే సాధ్యం. అది ఓ తపఃఫలం .ఈ దిశలో పయనిస్తున్న నీవు మరింత సఫలీకృతుడివి కావాలని కాంక్షించే ఓ సాధారణ పాఠకున్ని నేను.

SANGEETHA GEETHA REVIEW

శబ్దం నిద్ర పుచ్చుతుంది
శబ్దం నిద్రలేపుతుంది
శబ్దం మనసును వెన్న ముద్ద చేస్తుంది
శబ్దం భయపెడుతుంది
ఆ శబ్దం సంగీతం గా రావచ్చు
గీతంగా రావచ్చు
శబ్దానికి భాష అర్థాన్నిస్తే
సరిగమలు ప్రాణం పోస్తాయి
“శబ్ద శిల” “సంగీత – గీత శిల్పం” గా మారిన వైనం
దాని మహత్తు, అది అలరించేతీరును అంశంగా తీసుకొని
మీరు సృజియించిన ఈ రచన నిరుపమానము!
సంగీత –గీత సారాన్ని ఆస్వాదించి జన్మ సుసంపన్నం చేసుకోమని, సరిగమలను శ్వాసిస్తే అవే జీవన వీణను సరి చేస్తాయని ప్రబోధిస్తోంది మీ సంగీత గీత.
కళలు టైంవేస్టు ,అనే పిచ్చోళ్లకు ’యంత్రానికైనా కావాలి ఒరాలింగు-రెస్టు’ – అనే సందేశం నేటి తరానికి లేహ్య సమానం.
“బ్రహ్మ కేటాయించిన శ్వాసల కోటా
ఎప్పుడయిపోతే అప్పుడే టాటా! “
ఎంత సింపుల్ గా జీవిత రహస్యం విప్పారు-అత్యద్భుతం!
“” టీవీ చూస్తే పని పాడే ,బెటర్ ఐపాడే , దానికదే పాడే “”
“పాడే” త్రిపాత్రాభినయం చేసింది
“” చింతకాయలు రాలాయా సంగీతమంటే అంతేమరి “”
కొత్త నడక!
రాళ్ళే కరిగినప్పుడు చింతకాయలు రాలకపోవడమేంటి?
“” ఫ్రీగా వస్తే దేనికైనా ఎగబడతాం
పుస్తకాలైతే మూలన బెడతాం “”
చెప్పును బట్టలో పెట్టి దవడ పై కొట్టినట్లుంది
Single concept పై రాసినా ఎక్కడా repetition పోవడం మీ ప్రతిభకు తార్కాణం!
ఈ రచన లో వ్యంగ్యం ఉంది.వేదాంతం ఉంది. లలిత కళలనాశ్రయించి జీవనకారడవిని నందనవనంగా మార్చుకోమని ఉద్బోధ ఉంది.
సమాజం పట్ల బాధ ఉంది. బాధ్యత ఉంది. ఎంత చెప్పినా బుద్దిరాదేం అని అక్రోశం ఉంది.
సప్తస్వరాల్లా ఏడు పరిచయ వాక్యాలున్నాయి.positive గా వివరణాత్మకంగా బాగున్నాయి. ఒకే school of thought కు సంబంధింనట్లున్నాయి.
రచనలో ఎలాంటి భాగస్వామ్యం లేని జీవిత భాగస్వామిని చివరి అట్టపై వామపక్షాన చేర్చుకోవడం- ఎల్లవేళలా గీతను పలవరించడమనుకోవాలా!
మీరన్నట్లు ఒకేరాత్రి ఇవన్నీ రాయడం నిజమైతే మీ ప్రతిభ అంచనాలకందనిదే!
ఈ ప్రతిభ మరిన్ని కవన రీతుల్లో భాసిల్లి మీరు పరిపూర్ణ కవిగా రాణించాలని నా ఆకాంక్ష _
_బి.నర్సయ్య.

Saturday, December 31, 2011

WISH U HAPPY NEW YEAR-2012

కనకమహాలక్ష్మి కాలి అందియల లయ
జ్ఞానభారతి కఛ్ఛపి వీణియ శ్రుతి కలయ
ఆదిపరాశక్తి ఖడ్గ కాంతులు వెలయ
మీ ఇల్లు విజయ దుందుభుల శబ్దాలయ కావాలని మనసారా కోరుకొంటూ_
మిత్రులకు,స్నేహపాత్రులకు,ప్రేమమూర్తులకు..ఆంగ్ల వత్సరాది శుభాకాంక్షలు!!

Thursday, October 27, 2011

ఆంధ్రులు ఆరంభ
శూరులు
ఋజువయ్యిందిగా
పలుమారులు!!

తెగిస్తేనే
తెలంగాణ
తెగేదాకా లాగితేనే
ఉంటుంది మనుగడ

ఇక “ఓదార్పు”
తెలంగాణా లో
జరిగింది మార్పు
జగనన్న పర్యటనలో...

వంతులవారీ
నకరాలు..
తెలంగాణ పోరుపేర
రాజకీయ నాటకాలు!

నాడైనాఎన్నడైనా
తెలంగాణ జనాలే
ఆంధ్రుల ముందు
బకరాలే!!

Saturday, September 24, 2011

సాదర ఆహ్వానము!

సాదర ఆహ్వానము!
ఈ రోజు(25-09-2011) కరినగర్ మాతా మహా శక్తి మందిరం లో
నా ఆడియో సి.డి.”దయామృతవర్షిణి”(మహాశక్తి భక్తి గీతాలు) ఆవిష్కరణ కలదు
అందరూ అహ్వానితులే! !సమయం:ఉదయం 10.00
_రాఖీ

Monday, June 13, 2011

అంతా నాదేననుకొంటే
లేదే చింత
అంతా నాకే అనుకొంటేనే
చిక్కంతా

ప్రేమించు
ఫరవాలేదు
అందరిపట్ల చూపించగలిగితే
ఏ ఢోకాలేదు

పార్టీకో పేపరు
సపోర్ట్ గా ఛానలు
ఏం కూసినా
ఆత్మస్తుతి-పరనింద!!

జనం పిచ్చోళ్ళే
తాన అంటే తందాన అంటారు
బుర్రలేకుండా
తందామంటారు!!

ఎదురీదే వాడి
కెన్ని దెబ్బలు!
సంస్కరిద్దామన్నప్పుడల్లా
పెడబొబ్బలు!!

మనమెలాగూ
ఎదిరించలేం!
ముందడుగేసినవారినీ
అభినందించలేం!!

వ్యక్తికాదు ముఖ్యం
వ్యవస్థ!
అన్నాహజారే , రాందేవులకూ
తప్పలేదవస్థ!!


విషయమొదిలి
అరుస్తారేల?
గుమ్మడి దొంగలయ్యీ
జబ్బ చరుస్తారేల??
చెలియలి కట్టుందని
సంబరపడకు
సునామి వస్తే
కడలి కడకు ?!

ముగ్గురి సీటు నల్గురిదైంది
స్నేహం పంచితే!
ఇద్దరికిరుకే
విస్మరిస్తే !!

కూడు గుడ్డా
నువ్వేసే భిక్షే కదా!
ఈ బతుకు
ఓ రైతు బిడ్డా!!

విత్తులెరువులెండ్రిన్లు
మద్దతు ధరలు
నిత్యం రణాలే!
చావుక్కారణాలే!!

థింక్ పాజిటివ్


రాజుగారి పెద్ద భార్య
పతివ్రత
మరి చిన్న భార్య
మహా పతివ్రత!!

గ్లాసులో సగం
నీళ్లు లేవనుకొంటే నిరాశ
సగమున్నాయనుకొంటే
ఆశ!!
అంతా నాదేననుకొంటే
లేదే చింత
అంతా నాకే అనుకొంటేనే
చిక్కంతా

Saturday, April 2, 2011

స్నేహితులకు ,బ్లాగు మిత్రులకు -వీక్షకులకు, కవితాభిమానులకు ఖర నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!!