Thursday, July 30, 2009

పువ్వులో పరిమళం
గొంతులో మార్దవం
మనసవదా
పరవశం!(66)

ఆశ దోశ
అప్పడం వడ
రేట్లు చూస్తే
గుండెల్లో దడదడ!(67)

రాగం అనురాగం
భావం అనుభవం
చేయాలి సదా
సహయోగం(68)

కలం
ప్రసవించింది
కవల పిల్లలట!
నానీలు-గీతాలు!!(69)

ఘనం
జగానికి గగనమే అయితే
అది ఎలాగౌతుంది
ఘనం?(70)

Sunday, July 26, 2009

రైతేల రాజు?
పెట్టుబడిని
గిట్టుబడిని
తూచలేని తరాజు!(61)

సరస్వతీ!
కఛ్ఛపి తప్పిపోయిందా?
మా చిట్టిబాబుకి
దొరికింది కదా!!(62)

నవ్వులు మువ్వలైనయ్
గుండె ఢమరుకమైంది
మనసానంద
తాండవమే!(63)

చాచం కిష్టయ్య
సంగీత స్రష్టయ్య
పోటీకి దిట్టయ్య
ధర్మపురి బెస్టయ్య!(64)

చింతకాయలు రాలాయా!
వింతేముంది?
సంగీతమంటె
అంతే మరి!!(65)

Friday, July 24, 2009

చిరు నవ్వెంత
గొప్పది
బాధలు దాచే
బురఖా తానౌతుంది!(56)

గొంతు గుండా
వస్తే పాట
గుండె కూడ తెరిస్తే
అది తేనెల తేట!(57)

కోపాలు తాపాలు
చుట్టపు చూపుగా వస్తయ్
బిపి,షుగర్లై
ఆక్రమిస్తయ్(58)

త్యాగరాజు
సంగీత జగతికి రారాజు
స్మరించరా జనులు
ప్రతి రోజు!(59)

అన్నమయ్యా!
రసజ్ఞుల కీవె
అన్నమయ్యా
హాయి గొలిపే పున్నమయ్యా!!(60)

Thursday, July 23, 2009

రోగం కుదిరిందా
నాటి సంగీతం
మరి ముదిరిందా
ఇది నేటి సంగీతం!(51)

నాటి పాట
వినేటి పాట
తేనెల తేట!
నేటి పాట ఎందుకనేటి పాట?! !(52)

కఠం జేగంటే
ఎలుగెత్తి పాడిందంటే!
పెదవి విప్పదు
పాడమంటే?!(53)

సినీతార మాత్రం
కాదు లోభి
ఉదారంగా
చూపెడుతుంది నాభి!(54)

బాత్రూంది
ఎంతటి భాగ్యం
ఎంత మంది
నిజమైన కచ్చేరీలు వింది!(55)

Tuesday, July 21, 2009

టెక్నాలజీ
ఆహ్వానించ దగ్గదే!
కాని సంగీతం కూడ
సాఫ్ట్ వేరై పోయిందే?!(46)

సంగీతం
మధురమే
తాదాత్మ్య్పపు
మకరందం చిలికితే!(47)

టీవీలు సినిమాలు
చూస్తే పని పాడే!
బెటర్ ఐపాడే
దానికదే పాడే!!(48)

చిన్ని గుండె లో
ఎన్ని భావాలో
బుల్లి సెల్లు లో
ఎన్నెన్ని భాగ్యాలో(49)

ఏం పనీ పాటా లేదా?
బ్రతుకే పనైంది
పాటనే
కరువైంది!(50)

Saturday, July 18, 2009

ఒకటే వేదం
ఒకటే నాదం
ఒకే నినాదం
మానవతా వాదం(41)

ఐస్ క్రీంలు
శీతల పనీయాలు
గొంతు చెక్కు చెదర లేదా?
నువ్వే బాలు?!(42)

ఏ మున్సిపాల్టీ వాళ్ళు
మట్టు బెడతారు?
ఈ ఉగ్రవాదపు
పిచ్చి కుక్కల్ని!(43)

కోకిల
పాటనేర్చుకుందా!
దాని గురువు
జానకే కచ్చితంగా!!(44)

హృదయ
సాగర మథనం లో
పుట్టిన అమృతం
నా ప్రతి గీతం!(45)

Saturday, July 11, 2009

వేలపాటలు
క్యాసెట్లలో సిడీల్లో
వినే భాగ్యం లేకుంటే
నే తేనె టీగనే!(36)

సరిగమలకు
చూడకు
ప్రస్తారాలు సంయోగాలు
రాగం ఎద సరాగం!(37)

కచ్చేరి బాగుంది
ఇసుక రాలదు
ప్రశంసల జల్లు!
ఆర్ద్రతే నిల్లు?!(38)

పండగే!
గారెలూ బూరెలూ సరే
అక్కలూ బావలూ తయారే
సంతోషం జాడ?(39)

నేరస్తుడిలా
చూస్తారేం?
రాగాలు ఖూనీ చేసాననా!
ఖూనిరాగాలు తీసాననా?(40)

Thursday, July 9, 2009

సరసవంతపు
వ్యభిచారం=సంసారం
బలవంతపు
సంసారం=వ్యబిచారం

Friday, July 3, 2009

గొంతేం
పాపం చేసిందో
పాపం భావ తరంగాలని
ఎందుకు బయట పెట్టలేదో!(31)

పాట లోని
పా మాత్రమే
కనబడుతోంది పాప్ లో
`ట’ టాటా చెప్పేసిందట!(32)

భౌ భౌ లు
ఓండ్రల సౌండులు?
నేనింకా
పాట మొదలు పెట్టందే?!(33)

గతి శృతి సంగతి
పాట !
గంతులు కూతలు అరుపులు
పాప్!!(34)

సంగీతానికి
తరతరాలుగా
తరగని ధనం
సాధనం(35)

Thursday, July 2, 2009

గొంగళి పురుగే
రంగూ రూపూ మార్చుకుందే
కాకి మాత్రం
కోకిల కాలేదా?(26)

అయ్యో
వాడి తల కనబడదేం?
వెతలలో
కూరుకపోయిందేమో!(27)
దేశ పర్యటనం
అద్వైత ప్రభోదం
అశేష స్తోత్ర రచనం
శంకరానీకే సాధ్యం!(8)

ఘంటసాల రోజూ
మా ఇంటికొస్తాడు
భగవద్గీత
పాడుకుంటూ(29)

ప్రపంచం దారి
సూక్ష్మం లో మోక్షం
గ్రామఫోను మారి
ఐపాడ్ ప్రత్యక్ష్యం!(30)

Wednesday, July 1, 2009

సెల్లు సెల్లు కాదు
నేడది విశ్వరూపాన్ని
చూపే
బాలక్రిష్ణుడి బుల్లి నోరు!(21)

సమయం
సగం సెల్లు తింటుంది
మిగితాది
టీవీ పంచుకొంటుంది(22)

అన్నీ అమర్చుకున్నావ్
ఇక ఇప్పుడు
నీ దగ్గర లేని దొకటే
సమయం(23)

స్నేహితులు
బంధువులు
అందరూ ఉన్నారు
నీకు నీవు తప్ప!(24)

విర్రవీగుతున్నావ్ కదూ
నింగీనేలా
వినయం సహనం
చాటుతున్నట్టు లేవూ!(25)